Home

»

Latest News

Anil Ravipudi: జరుగుతుందా! అదే జరిగితే సినీ అదృష్టం పట్టినట్లే

Mar 26, 2026


రీసెంట్ గా ఫంకీతో సందడి చేసిన కయదు లోహర్ 
అనిల్ రావిపూడి మూవీ ఒకే అవుతుందా!
సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా న్యూస్ ఏంటి


రీసెంట్ గా మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్'తో 'ఫంకీ'(Funky)లో కలిసి సందడి చేసింది 'కయదు లోహర్'(Kayadu LOhar). ఆకట్టుకొనే అందమే కాదు అంతే అందమైన పెర్ఫార్మ్ ని ప్రెజెంట్ చేయగల సత్తా తన సొంతం. ప్రదీప్ రంగనాధన్ తో చేసిన డ్రాగన్ ఒక ఉదాహరణ. కానీ కెరీర్ కి  సరైన బ్రేక్ మాత్రం రాలేదని చెప్పాలి. మరి ఇప్పుడు ఆ బ్రేక్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా న్యూస్ నే  ఉదాహరణ. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

అనిల్ రావిపూడి(Anil Ravipudi)మన శంకర వరప్రసాద్ గారుతో లోకల్ సినిమా పరంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాక నెక్స్ట్ మూవీని వెంకటేష్,కళ్యాణ్ రామ్ తో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన కయదు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. మరి అదే నిజమైతే కయదు లోహర్ దశ తిరిగినట్లే. ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే కేవలం పేరు కాదు. ప్రేక్షకులు థియేటర్స్ కి తరలివచ్చేలా టాలీవుడ్ ని  లీజుకి తీసుకున్న నయా హిట్ బ్రాండ్. వయసుతో తారతమ్యం లేకుండా అనిల్ రావిపూడి సినిమాలకి తరలి వస్తున్న ప్రేక్షకులు, ఎక్స్ట్రా కుర్చీలే సాక్ష్యం. 

Also read: Prabhas: ప్రభాస్ పై పవన్ హీరోయిన్ రాశి కీలక వ్యాఖ్యలు.. నేనైతే ఆ విధంగా చేయను

పైగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సారి కూడా నెక్స్ట్ సంక్రాంతికి వస్తాడేమో అనే చర్చ కూడా ప్రతి ఇంట్లో జరుగుతుంది. అంతటి క్రేజ్ అనిల్ సొంతం. దీంతో  కయదు కనుక జాయిన్ అయితే తన అందమైన పెర్ఫార్మ్ తో ప్రేక్షకుల సినీ హార్ట్స్ లోకి చొరబడినట్లే. ఆ పరిస్థితే వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో కయదు కంటే ప్రేక్షకులకే బాగా తెలుసు. కాబట్టి కయదు సినీ దశ తిరిగినట్లే. అనిల్ రావిపూడి కూడా ప్రెజెంట్ తన కొత్త చిత్రానికి సంబంధిచిన పనుల్లోనే బిజీగా ఉన్నాడు.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com