టాలీవుడ్ టు హాలీవుడ్.. రాజమౌళికి అరుదైన గౌరవం
on Sep 8, 2022

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన ఆరు చిత్రాలను ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ గా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
'బాహుబలి' ఫ్రాంచైజ్ తో తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'తో హాలీవుడ్ స్టార్స్ సైతం తన వర్క్ గురించి మాట్లాడేలా చేశాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనున్న బియాండ్ ఫెస్ట్ లో 'ఫ్రమ్ టాలీవుడ్ టు హాలీవుడ్' రాజమౌళి డైరెక్ట్ చేసిన కొన్ని చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 30న 'ఆర్ఆర్ఆర్', అక్టోబర్ 1న 'ఈగ', 'బాహుబలి-1', 'బాహుబలి-2' సినిమాల స్పెషల్ స్క్రీనింగ్ ఉండనుంది. వీటితో పాటు 'మగధీర', 'మర్యాద రామన్న' చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రాలను తెలుగు భాషలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించనున్నారట. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ తో రాజమౌళి పేరు హాలీవుడ్ లో మరోసారి మారుమోగిపోవడం ఖాయమన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



