షూటింగ్ ముందే ప్రీపొడక్షన్ కోసం ఏకంగా 20 కోట్ల బడ్జెట్!
on Jan 18, 2023

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత సూపర్ సార్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసింది. ఇప్పటివరకు అపజయం అన్నది ఎరుగని దర్శకునిగా, మరీ ముఖ్యంగా మగధీర, ఈగ, బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్ క్లూజన్, తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం సాధించిన విజయాలతో రాజమౌళి క్రేజ్ అంబరాన్నిచుంబిస్తోంది. ఆయన ఊ అంటే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి చిత్రాలు చేయడానికి మన దేశ సినీ నిర్మాతలే కాదు.. విదేశీ నిర్మాణ సంస్థలు కూడా సిద్దంగా ఉన్నాయి. రాజమౌళి ఊ అంటే ఖాళీ చెక్‌లను కూడా ఇచ్చేందుకు పలువురు రెడీ. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఏకంగా ఎవరెస్ట్ శిఖరానికి ధీటుగా ఎగరవేసిన రాజమౌళి అంతర్జాతీయ యవనికలపై మన జెండా పాతారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో కె.యల్. నారాయణ నిర్మాతగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే చిత్రం ఇండియానా జోన్స్ తరహాలో ఉండనుందట.
ఈ సినిమాను సిరీస్‌గా తెరకెక్కించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన పలు అంతర్జాతీయ వేదికలపై తెలియజేశారు. ఇందులో మహేష్ క్యారెక్టర్ వరల్డ్ ట్రావెలర్ గా కనిపిస్తాడు అని చెప్పారు. అలాగే అమెజాన్ అడవుల నేపథ్యంలో కథాంశం ఉండబోతుందని కూడా కాస్త లీక్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ఆయన మహేష్ బాబు సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ హాలీవుడ్ క్యాస్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్వెల్ సిరీస్ లో నటించే నటీనటులను ఈ మూవీ కోసం ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాకు ఒక కథను సిద్ధం చేశానని ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కూడా తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మొదటి పార్ట్ లో 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారని తెలుస్తోంది. నిర్మాత కె.నారాయణ ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. ఇక సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏకంగా 20 కోట్లు కేటాయించారు. లొకేషన్స్ చూడటం కోసం అమెరికా, ఆఫ్రికా వెళ్లడం.... సినిమా స్టోరీని కాన్సెప్ట్ గా సిద్ధం చేసి తాను ఎలా సినిమాలు తీయబోయేది ముందుగానే విజువల్‌గా సిద్ధం చేసుకునే పనిలో జక్కన్న పడ్డారు. వీటికోసం ఓ మినిమం సినిమాకి పెట్టే పెట్టుబడిని అంటే 20కోట్లను నిర్మాతతో పెట్టిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రంతో మరోసారి హాలీవుడ్ స్థాయిలో తన సత్తాను ఘనంగా చాటుకోవాలని దర్శక ధీరుడు రాజమౌళి పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



