ప్రభాస్ బర్త్‌డేకి ఇంగ్లీష్‌లో రిలీజ్ కానున్న 'రాధే శ్యామ్' టీజర్!
on Oct 20, 2021
అక్టోబర్ 12 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతని నెక్ట్స్ ఫిల్మ్ 'రాధే శ్యామ్' టీజర్‌ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ టీజర్ ఇంగ్లీష్‌లో రానుండటం గమనార్హం. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశాడు ప్రభాస్. ఒక చైర్లో కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న తన పిక్చర్‌ను షేర్ చేసిన ప్రభాస్, "Who is Vikramaditya? Meet him on 23rd. Enjoy the #Radheshyam teaser in English with subtitles in different languages." అని రాసుకొచ్చాడు.
ఈ పోస్టర్ ఫ్యాన్స్‌లో చాలా క్యూరియాసిటీని రేకెత్తించింది. 23వ తేదీ ఉదయం 11.16 నిమిషాలకు ఈ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. రొమాంటిక్ డ్రామాగా తయారవుతున్న 'రాధే శ్యామ్'ను రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఇది నిర్మాణమవుతోంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తొలిసారి ప్రభాస్‌తో జోడీ కడుతున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా సమకూరుస్తున్నాడు. 2022 జనవరి 14న 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.