నానికి, శర్వాకి కోట్ల రూపాయలిచ్చిన రాజ్‌తరుణ్..?ఎందుకు..?
on Feb 7, 2017
.jpg)
సినీ పరిశ్రమ చిత్ర విచిత్రమైనది. ఒక హీరో కావాలని వదులుకున్న సినిమా మరో హీరోకి హిట్టిచ్చి అతన్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది.. ఉదాహరణకు.. వాస్తవానికి ఖైదీ సినిమా చేయ్యాల్సింది సూపర్‌స్టార్ కృష్ణ కానీ ఆ సమయంలో ఆయన డైరీ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ అప్పుడప్పుడే హీరోగా అడుగులు వేస్తోన్న చిరంజీవికి దక్కింది..ఇక అక్కడి నుంచి చిరు ప్రభంజనం ఎలా సాగిందో తెలిసిందే..ఇప్పుడు తాజాగా ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్ లాంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకువచ్చిన యంగ్ హీరో రాజ్‌తరుణ్ కూడా రెండు సూపర్‌హిట్ మూవీలను కావాలని చేజార్చుకున్నాడు..
అయితే బిజీగా ఉండటం వల్ల కాదు కథల ఎంపికలో సరైన అవగాహన లేకపోవడం వల్ల..ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏవో కాదు..శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సంక్రాంతికి విడుదలైన శతమానం భవతి, మరొకటి నాని హీరోగా వచ్చిన నేను లోకల్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ టాక్‌ను తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పంట పండిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు రాజ్‌తరుణ్ అకౌంట్‌లో పడుంటే అతని కెరీర్ ఎక్కడికి వెళ్లేదో చెప్పక్కర్లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



