Home

»

Latest News

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై రఘు కామెంట్స్!

May 21, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా నిన్న(మే 20) అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా "సీఎం ఎన్టీఆర్" నినాదాలతో ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ మోతమోగించారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

ఈ క్రమంలో రీసెంట్ గా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తారక్ పొలిటికల్ ఎంట్రీపై ప్రముఖ కమెడియన్ రఘు కారుమంచి (అదుర్స్ రఘు) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారని, ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావాలని కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వేరొకరిని చూసి రాజకీయాల్లోకి వస్తే అది ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే’ అవుతుందని రఘు వ్యాఖ్యానించారు. (Raghu Karumanchi Interview)

తెలుగువన్ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ.. "దళపతి విజయ్ దాదాపు 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో 69 సినిమాలు పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్టీఆర్ కేవలం 20 ఏళ్ల కెరీర్‌లో 30 సినిమాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం తారక్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. అందుకే ఆయన పాలిటిక్స్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు, అందులో తప్పులేదు. కానీ ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. ఎన్టీఆర్ భవిష్యత్తులో సొంతంగా పార్టీ పెడతారా? లేక ఉన్న పార్టీ బాధ్యతలు తీసుకుంటారా? అసలు వస్తారా రారా? అనేది తెలియకుండా ఇప్పుడే జడ్జిమెంట్స్ ఇవ్వడం అనవసరం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నేను కూడా కోరుకుంటాను. కానీ, ఎవరో వచ్చారని ఎన్టీఆర్ ను రమ్మనడం కరెక్ట్ కాదు. అది ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే’ అవుతుంది" అని అన్నారు.

తారక్ ఎప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చినా విజయ్ తర్వాత అంతటి చరిత్ర సృష్టించేది ఆయనేనని రఘు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఆయన్ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వాలని కోరారు.

ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రఘు ఎమోషనల్ అయ్యారు. 'ఆది సినిమా సమయం నుంచే తారక్‌తో తనకు బలమైన బంధం ఉందని, అన్న కోసం ప్రాణాలైనా ఇస్తానని రఘు అన్నారు. రఘు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com