Home

»

Latest News

Drishyam 3 X Review: 'దృశ్యం 3' మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఈ టాక్ అసలు ఊహించలేదు!

May 21, 2026

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దృశ్యం 3' (Drishyam 3) గురువారం (మే 21, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలైంది. మోహన్‌లాల్ పుట్టినరోజు రోజే ఈ సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం అంబరాన్నంటింది. ఉదయం ఆట నుంచే కేరళతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్లలో 80 శాతానికి పైగా (80% Occupancy) అక్యుపెన్సీతో ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది.

జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే మూడో పోరాటం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆరాటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రోజే బుక్ మై షోలో ఏకంగా 3,34,000 కి పైగా టికెట్ల సేల్స్ సాధించి అత్యధిక ప్రీ-సేల్స్ సాధించిన రెండో మలయాళ చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. (Drishyam 3 Twitter Review)

మొదటి ఆట చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, జీతూ జోసెఫ్ మరోసారి తన మార్క్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. సినిమా ఫస్టాఫ్ అంతా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో సాగుతూ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక భారీ ట్విస్ట్‌తో ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం కేవలం సినిమా కాదు, ఒక అద్భుతం (Absolute Cinema) అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎంట్రీ సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంది. జార్జ్‌కుట్టి క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ నటన విశ్వరూపం చూపించారని, మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రేక్షకులు కొనియాడారు.

సినిమా సెకండ్ హాఫ్, అందునా క్లైమాక్స్ పోర్షన్స్ ఈ చిత్రానికి అసలైన ప్రాణమని ప్రేక్షకులు చెబుతున్నారు. గత రెండు భాగాల కంటే ఇందులో ట్విస్టులు, మైండ్ గేమ్స్ మరింత పీక్స్‌లో ఉన్నాయట. జార్జ్‌కుట్టికి వ్యతిరేకంగా సాగే ఒక ఇన్విజిబుల్ సైకలాజికల్ వార్ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతుంది. 

వినాయక్ ఎడిటింగ్, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ, అనిల్ జాన్సన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను మరింత రసవత్తరంగా మార్చేశాయి. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టడం ఖాయమని, జీతూ జోసెఫ్ థ్రిల్లర్ల దేవుడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

మొత్తం మీద 'దృశ్యం 3' బ్లాక్‌బస్టర్ అని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని ఎక్స్ (ట్విట్టర్) టాక్ స్పష్టం చేస్తోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com