లారెన్స్ హీరోగా తమిళ 'రంగస్థలం'
on Dec 3, 2019
2018లో వచ్చిన 'రంగస్థలం' ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్టయిందో మనకు తెలుసు. అటు రాంచరణ్ కెరీర్‌లో, ఇటు డైరెక్టర్ సుకుమార్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్‌లోనూ ఒకటిగా అది నిలిచింది. నటుడిగా చరణ్‌కూ, డైరెక్టర్‌గా సుకుమార్‌కూ ఆ సినిమా తెచ్చిన పేరు సామాన్యమైంది కాదు. వినికిడి లోపం ఉన్న ఒక దిగువ తరగతి యువకుడిగా చరణ్ ప్రదర్శించిన అభినయం 'ఒన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ టాలీవుడ్ ఇన్ ద డికేడ్'గా చెప్పుకోవచ్చు. అలాంటి ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాంచరణ్ చేసిన చిట్టిబాబు క్యారెక్టర్‌ను రాఘవ లారెన్స్ చేయనున్నాడు. ఇక దర్శకత్వ బాధ్యతల్ని లింగుస్వామి చేపట్టనున్నాడు. ఈ కాంబినేషన్‌తో ఎవరు సినిమా నిర్మిస్తారనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
'రంగస్థలం'కు కలిసి పనిచెయ్యాలని లారెన్స్, లింగుస్వామి నిర్ణయించుకున్నారనే విషయం మాత్రం రూఢిగా తెలియవచ్చింది. వాస్తవానికి ఆ ఇద్దరూ వేరే ప్రాజెక్ట్ కోసం చాలా కాలం క్రితమే కలిసి పనిచేయ్యాల్సింది. లారెన్స్ 'కాంచన' సిరీస్‌తో బిజీగా ఉండటం, తర్వాత హిందీలో 'లక్ష్మీబాంబ్'ను డైరెక్ట్ చేసే చాన్స్ రావడంతో ఇప్పటి దాకా వాళ్ల కాంబినేషన్ కుదరలేదు. 'లక్ష్మీబాంబ్' సినిమా రిలీజవగానే, లింగుస్వామి డైరెక్షన్‌లో నటించేందుకు లారెన్స్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2020 ప్రథమార్ధంలోనే 'రంగస్థలం' తమిళ రీమేక్ పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
