.jpg)
65 ఏళ్ల ముదుసలి అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ గుండెల్లో 30 ఏళ్ల రాధికా ఆప్టే ఉండడం ఏంటీ? అని కంగారుపడుతున్నారా.. ఆయన గుండెల్లో రాధికా ఆప్టే ఉండడం నిజమే కానీ.. అది కేవలం "కబాలి" పోస్టర్ కు మాత్రమే పరిమితంలెండి. "కబాలి" జూలై 22 విడుదలను పురస్కరించుకొని రేపట్నుంచి చెన్నైలో పేపర్ యాడ్స్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకూ వచ్చిన "కబాలి" పోస్టర్స్ అన్నిటికంటే భిన్నంగా తాజా పోస్టర్ ను డిజైన్ చేయించాడు దర్శకుడు రంజిత్. "కబాలి" అనగానే అందరూ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా అనుకొంటున్నారు. అలా అనుకొంటున్నవారికి "కబాలీ"లో యాక్షన్ మాత్రమే కాదు బోలెడంత సెంటిమెంట్ కూడా ఉందని తెలియజెప్పడానికి.. రజనీకాంత్ గుండెల్లో రాధికా ఆప్టే ఉన్నట్లుగా ఓ పోస్టర్ ను వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది!
.jpg)





