Home

»

Latest News

హాస్పిటల్ లో కమల్ హాసన్!

Jul 14, 2016 10:27AM

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన కమల్ హాసన్ ను నేడు ఉదయం చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు. నేడు ఉదయం ఆయన ఆఫీసులోని మేడ మీద నుంచి మెట్లు దిగుతూ కిందకు వస్తుండగా.. అదుపుతప్పి మెట్లు జారిపడ్డారట. పడడంతోనే కమల్ కాలు విరిగిందని, వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేర్పించారని, ప్రస్తుతం చికిత్స జరుగుతోందని చెన్నై వర్గాల సమాచారం.

దీంతో.. అసలే అనుకొన్నదానికంటే లేట్ గా జరుగుతున్న "శభాష్ నాయుడు" ఈ కారణంగా మరింత లేట్ అయ్యే అవకాశముంది. అలాగే.. ఈనెలాఖరుకు కమల్ "లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్" అవార్డ్ అందుకోవడానికి లండన్ వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఘటనతో ఆ లండన్ టూర్ దాదాపుగా క్యాన్సిల్ అయినట్లేనని తెలుస్తోంది. ఇకపోతే.. ప్రస్తుతం కమల్ పరిస్థితి బానే ఉందని, కొద్ది గంటల్లోనే ఆయన్ను తిరిగి ఇంటికి పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కమల్ హాసన్ పి.ఆర్ టీమ్ తెలిపింది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com