Home

»

Latest News

Raajeev Kanakala: రాజీవ్ కనకాల అలెర్ట్.. రంగంలోకి నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి  

May 13, 2026 4:59PM

 


తెలుగు సినిమా ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు రాజీవ్ కనకాల(Rajeev Kanakala). ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా ఉండేలా చేయగలిగే ధీశాలి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ అనే టాగ్ లైన్ కూడా రాజీవ్ సొంతం. రీసెంట్ గా రాజీవ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో ఉన్న పళంగా వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చాడు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   

హైదరాబాద్‌లో ఉన్న వైబ్రాంట్ అనే స్కూల్‌‌ ఈవెంట్ కి రాజీవ్ గెస్ట్ గా హాజరయ్యాడు. దీంతో రాజీవ్ తీరుపై నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ స్పందిస్తు వైబ్రాంట్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా నడుస్తుంది. అటువంటి స్కూల్ ని రాజీవ్  ఎలా ప్రమోట్ చేస్తాడంటు సదరు నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్( NVTS ) ఫైర్ అయ్యింది. దీంతో  రాజీవ్ కనకాల ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేసాడు. అందులో అయన మాట్లాడుతు  వైబ్రాంట్ స్కూల్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. మంచి మార్కులు సంపాదించిన స్కూల్ పిల్లలకి నా చేతుల మీదుగా చిన్నపాటి బహుమతులు, సత్కారాలు, సన్మానాలు జరిగాయి.  సెలబ్రిటీ అనుకోండి.. తెలిసిన వ్యక్తి అనుకోండి.. మీలో ఒకడిగా అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ పవన్ వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు.

Also read: Mouni Roy: భర్తతో విడిపోతున్నారా? రూమర్లకి చెక్ పెడుతున్న మౌనీ రాయ్ పిక్స్

నాకు నిజంగా ఆ స్కూల్ గురించి అవన్నీ తెలియదు. సందేహాలు ఏమైనా ఉంటే పేరెంట్స్ అంతా ఆ స్కూల్ దగ్గరకు వెళ్లి కనుక్కోండి. NVTS వాళ్లు ఏవైతే అడిగారో అవన్నీ కనుక్కుని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. స్కూల్ ప్రమోషన్స్ లో నా ఫోటోలు, వీడియోలు వాడొద్దు అని వైబ్రాంట్ యాజమాన్యానికి  చెప్పాను. స్కూల్ విషయంలో నన్ను అలెర్ట్ చేసిన NVTS కి ధన్యవాదాలని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com