
మెగాస్టార్ విశ్వంభర(Vishwambhara)ఫేమ్ మౌనీ రాయ్(Mouni Roy)తన భర్త సూరజ్ నంబియార్(Suraj Nambiar)తో విడిపోనుందనే న్యూస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడిపోతున్నారనే వార్తలకి బలం కూడా చేకూరినట్లయింది. రీసెంట్ గా ఈ విషయంపై మౌనీ రాయ్ స్పందించడం జరిగింది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'మీడియా సంస్థలన్నింటికీ నా విన్నపం. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయకండి. మాకు కొంత సమయం, ప్రైవసీ ఇవ్వండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. ఆమె నేరుగా విడాకుల గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, వస్తున్న వార్తలు తప్పుడు కథనాలు అని పేర్కొనడం గమనార్హం. కానీ సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ ఇద్దరి పెళ్లి ఫోటోలని తొలగించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన అకౌంట్ ని డీయాక్టివేట్ చేశాడు. మౌనీ రాయ్ స్నేహితురాలు అగ్ర హీరోయిన్ దిశా పటానీ కూడా సూరజ్‌ను అన్‌ఫాలో చేసింది. మరి మౌనీ రాయ్ ఏమో అవాస్తవాలని అంటుంది.
Also read: Suriya: చప్పుడు లేని వీరభద్రుడు.. కారణం ఇదేనా!
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ వివాహం జనవరి 27, 2022న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఫోర్ ఇయర్స్ కే విడిపోతున్నారనే వార్తలు రావడం అభిమానులని కలవరపెడుతోంది.మౌని రాయ్ నాగిని సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా పేరు పొందిన విషయం తెలిసిందే.






