నితిన్‌తో 'రారా రెడ్డీ నేను రెడీ' అంటున్న అంజలి! స్పెషల్ సాంగ్ అదిరింది!!
on Jul 9, 2022

నితిన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి రూపొందిస్తోన్న మూవీ.. 'మాచర్ల నియోజకవర్గం'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఈరోజు "రారా రెడ్డీ.. నేను రెడీ" అనే మాస్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మూవీలో ఈ సాంగ్‌ను నితిన్, అంజలిపై తీశారు. అంటే ఓ స్పెషల్ నంబర్‌గా ఇది వస్తుంది. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ మస్తు మాస్ బీట్‌తో ట్యూన్స్ ఇస్తే, లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ రాశాడు. లిప్సిక తన హస్కీ వాయిస్‌తో ఈ పాటకు ఊపు తెచ్చింది.
నితిన్‌తో "రారా రెడ్డీ నేను రెడీ" అని అంజలి చిందులేస్తుంటే.. చూడ్డానికి బాగుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అలరించింది. ఆ పాటలో అంజలి ఎక్స్‌ప్రెషన్స్, నితిన్‌తో ఆమె కెమిస్ట్రీ బాగున్నాయి. నటిగానే కాకుండా డాన్సర్‌గానూ తను రాణిస్తానని ఇదివరకే అంజలి ప్రూవ్ చేసుకుంది. 'సరైనోడు'లో అల్లు అర్జున్‌తో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ "బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే.." సాంగ్ ఇంకా మన కళ్లముందు మెదులుతూనే ఉంది.
"రారా రెడ్డీ.. నేను రెడీ" సాంగ్ కూడా ఆ రేంజ్‌లో పాపులర్ అయ్యేట్లు కనిపిస్తోంది. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీలో మంచి కలర్‌ఫుల్‌గా వచ్చింది సాంగ్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీని ఆకెళ్ల రాజ్‌కుమార్ సమర్పిస్తున్నారు. ఆగస్ట్ 12న 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రిలీజవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



