క్వీన్ రీమేక్ కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది
on Mar 18, 2016
.jpg)
బాలీవుడ్ లో చాలా చిన్న సినిమాగా వచ్చి, అవార్డులు, కలెక్షన్లు కొల్లగొట్టుకుపోయిన సినిమా క్వీన్. కంగనా రనౌత్ ఈ ఒక్క సినిమా దెబ్బతో సూపర్ స్టార్ డం సంపాదించేసుకుంది. ఇలాంటి సినిమాను సౌత్ లో రీమేక్ చేద్దామనుకుంటే, పాపం త్యాగరాజన్ కు ఒక్క హీరోయిన్ కూడా దొరకలేదు. ఎంత ట్రై చేసినా, సీనియర్ హీరోయిన్లందరూ ఏదో కారణం చెప్పి ఈ మూవీ నుంచి ఎస్కేప్ అయిపోయారు. త్రిష, నయనతార, సమంత, నిత్యామీనన్ అంటూ అందర్నీ ప్రయత్నించి విసిగిపోయిన క్వీన్ రీమేక్ టీం కు ఎట్టకేలకు ఆ పాత్రకు తగ్గ హీరోయిన్ దొరికింది.

ధనుష్ తో మరియన్ సినిమాలో నటించిన మళయాళ భామ పార్వతిని క్వీన్ గా సెలక్ట్ చేసుకున్నారు. మాజీ హీరోయిన్ రేవతి డైరెక్ట్ చేస్తుండగా, సుహాసినీ మణిరత్నం మాటలు రాయబోతున్నారు. మళయాళంలో ఛార్లీ, తమిళ్ లో మార్యన్, బెంగళూర్ డేస్ పార్వతికి మంచి పేరు తీసుకొచ్చాయి. 2008 లో వచ్చిన తమిళ మూవీ ' పో ' కు ఆమెకు ఫిల్మ్ ఫేర్ వచ్చింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన పార్వతే క్వీన్ పాత్రకు కరెక్ట్ గా సరిపోతుందని, ఆమె ఈ సినిమాకు ఒప్పుకోవడం పట్ల మూవీ టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నారట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న క్వీన్ రీమేక్ ను తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



