తెలుగునాట 75 శాతం రికవరీ అయిన 'పుష్ప'.. తెలంగాణలో ప్రాఫిట్స్ మొదలయ్యాయ్!
on Dec 27, 2021

అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన 'పుష్ప' మూవీ తెలుగునాట పది రోజుల్లో 75 శాతం రికవరీని సాధించింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తెలంగాణలో మాత్రం లాభాల్లోకి అడుగుపెట్టడం గమనార్హం. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విడుదలైన పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 76.46 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఈ ప్రాంతాల్లో 'పుష్ప' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 101.75 కోట్లు. అంటే 75 శాతం రికవరీ అయ్యిందన్న మాట.
ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధరలను తగ్గించడం, తద్వారా పలు థియేటర్లు మూతపడటం అక్కడ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుండగా, తెలంగాణలో మాత్రం 'పుష్ప' 10 రోజులకు బ్రేకీవెన్ సాధించడం గమనార్హం. ఈ ఏరియాలో 'పుష్ప'పై బయ్యర్లు రూ. 36 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఇప్పటికే రూ. 37.31 కోట్ల షేర్ వచ్చేసింది.
Also read: తెలుగునాట 'అఖండ' లాభం 30 శాతం.. తెలంగాణలో మాత్రం 87 శాతం!
ఆంధ్రలో బయ్యర్లు పెట్టిన రూ. 47.75 కోట్ల పెట్టుబడికి వచ్చింది రూ. 26.19 కోట్ల షేర్ మాత్రమేనని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే రికవరీ 55 శాతం లోపేనన్న మాట. ఈ ట్రెండ్‌ను బట్టి ఆంధ్ర ఏరియాలో పుష్ప భారీగా నష్టపోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే రాయలసీమ విషయానికి వస్తే.. అక్కడ వచ్చిన వసూళ్లు రూ. 12.96 కోట్లు. ఇక్కడ బయ్యర్లు పెట్టింది రూ. 18 కోట్లు. అంటే రికవరీ శాతం 72. రానున్న రోజుల్లో ఇక్కడ 'పుష్ప' బ్రేకీవెన్ సమీపానికి రావచ్చునని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా సినిమా టికెట్ల విషయంలో, థియేటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు పుష్ప కలెక్షన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది స్పష్టం. ఆంధ్రాలో ఒక్క నెల్లూరు మినహాయిస్తే మిగతా ఏరియాల.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు.. బయ్యర్లు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
Also read: మంచు విష్ణు కనిపించుట లేదు! ఆరా తీస్తున్న టాలీవుడ్ వర్గాలు!!
ఇక దేశంలోని మిగతా ప్రాంతాల విషయానికి వస్తే కర్నాటక, కేరళలో బ్రేకీవెన్ సాధించిన 'పుష్ప', తమిళనాడులో లాభాల్లోకి అడుగుపెట్టింది. హిందీ వెర్షన్ అయితే ఇప్పటికే 80 శాతం ప్రాఫిట్‌ను సాధించి, అక్కడి బయ్యర్లను ఆనంద డోలికల్లో ముంచేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



