'పుష్ప' కేశవ హీరోగా 'సత్తి గాని రెండు ఎకరాలు'!
on Nov 17, 2022

మైత్రి మూవీస్ మేకర్స్, ఆహా సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని త్వరలో రివీల్ చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.
'పుష్ప: ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్రలో నటించి మెప్పించిన జగదీష్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రి, ఆహా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో 'జాతి రత్నాలు' ఎడిటర్ అభినవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి 'సత్తి గాని రెండు ఎకరాలు' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో సైతం #SGRE అంటూ సినిమా టైటిల్ కి సంబంధించి క్లూ ఇచ్చారు మేకర్స్. 'పుష్ప'లో కేశవగా అలరించిన జగదీష్.. ఇప్పుడు హీరోగా సత్తి పాత్రలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. త్వరలోనే జగదీష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న 'సత్తి గాని రెండు ఎకరాలు' చిత్రం నేరుగా ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుందని సమాచారం. జై క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



