అఫీషియల్.. పుష్ప 3 రిలీజ్ ఎప్పుడంటే..?
on Mar 16, 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) 'పుష్ప'తో సంచలనం సృష్టించారు. 2021 డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప-1'తో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన ఈ ద్వయం.. 2024 డిసెంబర్ లో వచ్చిన 'పుష్ప-2'తో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఇప్పటికే వీరు 'పుష్ప-3' ని కూడా అనౌన్స్ చేశారు. అయితే నిజంగా పుష్ప-3 ఉంటుందా? ఒకవేళ ఉంటే, ఎప్పటికి ప్రేక్షకులకు ముందుకు వస్తుంది? అనే ప్రశ్నలు ఉన్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. (Pushpa 3)
మార్చి 28న విడుదల కానున్న 'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విజయవాడ వెళ్ళిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్.. పుష్ప-3 అప్డేట్ ఇచ్చారు. " పుష్ప-3 ఖచ్చితంగా ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు దర్శకులు అట్లీ, త్రివిక్రమ్ గార్లతో సినిమాలు చేస్తున్నారు. ఆ రెండు కంప్లీట్ చేయడానికి ఆయనకు రెండేళ్ళు పడుతుంది. అలాగే సుకుమార్ గారు కూడా తన నెక్స్ట్ ఫిల్మ్ ని రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యి, ఈ కథ రాసుకోవడానికి ఆయనకు కూడా ఈజీగా రెండేళ్ళు పడుతుంది. ఖచ్చితంగా రెండున్నర ఏళ్లలో పుష్ప-3 మొదలవుతుంది. ఈసారి ఇంత లేట్ చేయం. 2028 లో పుష్ప-3 వస్తుంది." అని రవిశంకర్ చెప్పుకొచ్చారు.
పుష్ప-2 వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. మరి పుష్ప-3 అంతకుమించిన ప్రభంజనం సృష్టిస్తుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
