దానవీరశూరకర్ణ,లవకుశ తర్వాత పుష్ప 2 నే
on Nov 29, 2024

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2(pushpa 2) డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతుండగా వాటిల్లో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ ని పూర్తి చేసుకోగా రన్ టైం విషయంలో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది.
పుష్ప రన్ టైం మూడు గంటల ఇరవై నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది.గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(ntr)నటించిన 'లవకుశ' చిత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లెంగ్త్ తో తెరకెక్కగా,ఆ తర్వాత 'దానవీరశూరకర్ణ' మూడుగంటల నలభై ఆరు నిమిషాలతో తెరకెక్కింది.శోభన్ బాబు రాముడుగా చేసిన 'సంపూర్ణ రామాయణం' మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ మూడు చిత్రాలు కూడా డ్యూరేషన్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకొని బడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు వీటి తర్వాత తెలుగులో హయ్యెస్ట్ డ్యూరేషన్ తో రాబోయే మూవీ పుష్ప 2 అని చెప్పవచ్చు.
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్(rrr)మూడు గంటల ఐదు నిమిషాల డ్యూరేషన్ తో తెరకెక్కగా యానిమల్ మూడుగంటల ఇరవై తొమ్మిది నిమిషాలతో తెరకెక్కినా కూడా హిందీ సినిమా లెక్కలోకి వెళ్లిపోయింది. ఇక పుష్ప 2 మేకర్స్ అయితే మూవీ విజయానికి డ్యూరేషన్ కి సంబంధం లేదని, ప్రేక్షకులు లెంగ్త్ విషయం కూడా తెలియని విధంగా సుకుమార్ తెరకెక్కించాడని చెప్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



