
తెలుగు సినిమా కెపాసిటీని భారతీయ సినీ రంగానికి చాటి చెప్పిన చిత్రం పుష్ప 2(Pushpa 2).. విడుదలైన ఫస్ట్ డే నుంచే రికార్డుల వేట మొదలుపెట్టి, ఊహించని రీతిలో వసూళ్ల సునామీ సృష్టించింది. కేవలం 8 రోజుల్లోనే గ్లోబల్ మార్కెట్‌లో 1000 కోట్ల క్లబ్‌లో చేరిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రం కూడా పుష్ప 2 నే.
పుష్ప 2 బాక్సాఫీస్ ప్రస్థానం అక్కడితో ఆగలేదు. విడుదలైన 22 రోజుల్లోనే 1500 కోట్లతో పాటు వరల్డ్ వైడ్ గా ఎండింగ్ ఫిగర్ 1871 కోట్ల గ్రాస్ దాకా రాబట్టి తెలుగు సినిమా కాలర్ ఎత్తుకునేలా చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'రాకా'పై పడింది. పుష్ప 2 వసూళ్లని అల్లు అర్జున్ 'రాకా' దాటేస్తుందా? అనే చర్చలు అభిమానులతో పాటు ట్రేడ్ సర్కిల్స్ లో మొదలయ్యాయి. 'రాకా'పై ఇంతటి భారీ అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం దీని వెనుక ఉన్న క్రేజీ కాంబినేషన్. వరుస బ్లాక్‌బస్టర్లతో ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న సంచలన దర్శకుడు అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. సున్ పిక్చర్స్ బ్యానర్‌పై సుమారు 700 కోట్ల నుండి 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అట్లీ గత చిత్రం 'జవాన్' బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించగా, అల్లు అర్జున్ 'పుష్ప 2'తో గ్లోబల్ మార్కెట్‌ను శాసించాడు. ఇలాంటి ఇద్దరు వెయ్యి కోట్ల క్లబ్ వీరులు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం వల్ల బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల మార్కుని సులువుగా అందుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: వరుస ప్లాపుల తర్వాత నితిన్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కి ఇక నో రెస్ట్
ఈ సినిమాలో కేవలం కాంబినేషన్ మాత్రమే కాకుండా, కథాంశం మరియు సాంకేతికత కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్. ఇది పునర్జన్మలు మరియు పారలల్ యూనివర్స్ (సమాంతర విశ్వాలు) నేపథ్యంలో సాగే ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్నమైన పాత్రల్లో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు సిజిఐ హంగులతో రాబోతున్న ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండటంతో, ఉత్తరాది మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా తిరుగుండదని భావిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న 'రాకా' చిత్రాన్ని డిసెంబర్ 2027 లో క్రిస్మస్ కానుకగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీపికా పదుకునే, ఫెమినా జార్జ్, నైలా గ్రేవేల్ కీ రోల్స్ లో చేస్తున్నారు.
allu arjun, raaka, atlee, deepika padukone, femina geroge






