తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప' ఫస్ట్ డే కలెక్షన్ ఇదే!
on Dec 18, 2021

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప: ది రైజ్' తొలిరోజు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.90 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కలెక్షన్ పరంగా బన్నీ కెరీర్‌లో ఇది టాప్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 'అల.. వైకుంఠపురములో' సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.93 కోట్ల షేర్ రాబట్టింది.
Also read: 'పుష్ప' విడుదలయ్యాక మరోసారి వైరల్ అయిన మహేశ్ ట్వీట్!
ఆంధ్రాలో రూ. 9.26 కోట్ల షేర్ వసూలు చేసిన 'పుష్ప', తెలంగాణలో రూ. 11.44 కోట్లు, రాయలసీమలో రూ. 4.20 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. తెలంగాణలో ఐదో ఆటకు ప్రభుత్వం అనుమతించడం వల్ల ఆ మేర 'పుష్ప'కు లాభం చేకూరింది. ఆంధ్రలో ఎక్స్‌ట్రా షోలకు అక్కడి ప్రభుత్వం రెడ్ సిగ్నల్ చూపించడం తెలిసిందే. అయినప్పటికీ ఆంధ్ర, రాయలసీమ ఏరియా కలిపి 'పుష్ప' రూ. 13.46 కోట్ల షేర్ రావడం విశేషమే.
Also read: మార్నింగ్ షోస్‌కు 'పుష్ప' ఆక్యుపెన్సీ ఇదే!
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగునాట అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో 'పుష్ప' చూపించింది. పుష్పరాజుగా బన్నీ చెలరేగి చేసిన నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. క్లైమాక్స్ వీక్‌గా ఉందనే టాక్ ఒక్కటే సినిమాకు మైనస్ అని చెప్పాలి. రష్మిక మందన్నతో బన్నీ రొమాన్స్ ఆకట్టుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



