
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ల కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఇండస్ట్రీలో సరికొత్త సంచలనానికి తెరలేపారు. వర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'స్లమ్‌డాగ్ -33 టెంపుల్ రోడ్' (Slumdog: 33 Temple Road).
ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ సిగ్నేచర్ స్టైల్ కు తగ్గట్టుగా ఎంతో రా అండ్ రస్టిక్ గా, ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 'రా స్ట్రీట్స్.. రియల్ స్కార్స్.. రూత్‌లెస్ ఎమోషన్స్' అంటూ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను మేకర్స్ అప్పుడే పరిచయం చేశారు. ఒక ఊరమాస్ లోకల్ స్ట్రీట్ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో, పూరి జగన్నాథ్ తనదైన మార్క్ డైలాగ్స్ మరియు క్యారెక్టరైజేషన్ తో విజయ్ సేతుపతిని మునుపెన్నడూ చూడని విధంగా వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నారు.
ఈ మోస్ట్ అవేటెడ్ మూవీకి సంబంధించిన లేటెస్ట్ క్రేజీ అప్‌డేట్ ని మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. 'స్లమ్‌డాగ్' సినిమాకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అండ్ స్ట్రైకింగ్ టీజర్ ను జూన్ 8 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పోస్టర్ లో హీరో కళ్ళకు నల్లటి గుడ్డ కట్టుకుని, చేతిలో రక్తం అంటిన కత్తితో ఊరమాస్ లుక్ లో కనిపిస్తూ వెనుక నుంచి పోజు ఇవ్వడం సినిమా ఏ రేంజ్ వైల్డ్ యాక్షన్ తో ఉండబోతుందో హింట్ ఇస్తోంది.
జూన్ 8న సాయంత్రం 6 గంటలకు రాబోయే ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ నటి టబు, క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు శరత్ కుమార్, బ్రహ్మాజీ, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని కేవలం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ డైరెక్షన్, విజయ్ సేతుపతి ఇంటెన్స్ యాక్టింగ్ తో కూడిన ఈ 'స్లమ్‌డాగ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.






