
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది' (peddi) థియేటర్లలోకి వచ్చిందో లేదో అప్పుడే పెద్ద వివాదంలో చిక్కుకుంది. మూవీలో ఒకవైపు సమాజంలో అణచివేత, ఆత్మగౌరవం, హక్కుల గురించి సుదీర్ఘమైన సందేశాలు ఇస్తూనే, మరోవైపు జాన్వీ పోషించిన ఆచ్చాయమ్మ క్యారక్టర్ ని కేవలం గ్లామర్ బొమ్మగా మార్చేసి మితిమీరిన శృంగారభరితంగా చూపించారంటూ ప్రముఖ సింగర్ సుమంగళి అరియనాయగం చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
సుమంగళి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో "సమాజంలో బలహీనులుగా మారిపోవడం వల్ల వచ్చే బాధ, గాయం గురించి కథ రాయడానికి ఒక గది నిండా పవర్‌ఫుల్ మగవాళ్లంతా కూర్చున్నారు. కానీ, అదే ఊపులో వారు జాన్వీ కపూర్ క్యారక్టర్ ని కేవలం కెమెరా లెన్స్ ముందు ఒక అందాల ప్రదర్శన వస్తువుగా, బలవంతపు ముద్దు సీన్ కోసం ఒక ప్రాప్‌గా మార్చేశారు. కేవలం పాటలు ముగిసిపోగానే పక్కన పడేసే ఒక సాధనంగా వాడుకున్నారు" .సినిమా రూపకర్తలకి మానవ గౌరవం అంటే ఏంటో బాగా తెలుసని, కానీ ఆ గౌరవానికి ఈ పాత్ర అర్హురాలు కాదని వారే స్వయంగా నిర్ణయించుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కథానాయికకి జరిగిన అత్యంత ఖరీదైన అవమానం ఇదేనంటూ పోస్ట్ చేసింది.
ఈ వివాదం ఇంతటితో ఆగలేదు, స్వయంగా జాన్వీ కపూర్ ఈ విమర్శల పోస్ట్‌ను లైక్ చేయడం ఇండస్ట్రీ వర్గాలని సైతం విస్మయానికి గురిచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఈ విధమైన మితిమీరిన గ్లామర్ షాట్స్ మరియు బలవంతపు రొమాంటిక్ సీన్స్ పట్ల జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
Also read: Karuppu: కరుప్పు విజయంపై కొత్త వివాదం.. విజయ్ vs సూర్య
సినిమా దర్శకుడు బాక్సాఫీస్ నంబర్ల కోసం, కలెక్షన్ల కోసం ఒక నటి యొక్క ప్రొఫెషనల్ సరిహద్దులను, ఆమె సమ్మతిని పూర్తిగా పక్కనబెట్టి ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్స్‌ను అలాగే ఉంచేశారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. జాన్వీ ఈ పోస్ట్‌ను లైక్ చేయడంతో, డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రవర్తనపై మరియు సినిమాలో హీరో ప్రవర్తించే విధానాన్ని 'రొమాన్స్' అని సమర్థించడంపై నెటిజన్లు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'పెద్ది' సినిమాలో మహిళల ప్రాధాన్యత, వారి పాత్రల చిత్రీకరణపై ఒక పెద్ద చర్చ నడుస్తోంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పెద్ది తొలి రోజు 135 .36 కోట్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.






