ఏంటి పూరీగారూ ఈ ఓవర్ స్పీడు..?
on May 12, 2016

పూరీ జగన్నాథ్ అంటే వేగానికి మారు పేరు. వరసపెట్టి ఫటా ఫటా సినిమాలు తీసేసినా, ఫ్లాపులైనా పట్టించుకోకుండా జోరు కొనసాగించినా, అది పూరీ వారికే చెల్లింది. ఇక రీసెంట్ గా లోఫర్, జ్యోతిలక్ష్మి అంటూ వరస ఫ్లాపుల్లో ఉన్న పూరీకి పెద్ద హీరోలెవరైనా డేట్లు ఇచ్చే స్కోప్ తక్కువే. పూరీ అగ్రదర్శకుడైనప్పటికీ సూపర్ హిట్ సినిమా కొడితేనే స్టార్స్ ఇంట్రస్ట్ చూపిస్తారు. ప్రస్తుతానికి పూరీ బ్యాగులో ఉన్న ఒకే ఒక సినిమా, కళ్యాణ్ రామ్ మూవీ. ఇక్కడి వరకూ న్యూస్ కరెస్టే. అయితే లిస్ట్ లో ఉన్న తర్వాతి పేర్లే కాస్త కన్ఫ్యూజన్ కలిగిస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ పూరీతో సినిమా చేస్తాడా..? సూపర్ స్టార్ కు ఇంకో సినిమా చేసే టైమూ లేదు, స్కోపూ లేదు. కానీ పూరీ మాత్రం తన ట్విట్టర్లో జనగణమన అని పేరు ప్రకటించేశాడు. ఇక ఎన్టీఆర్ తో నేతాజీ అనే సినిమా అంటూ వచ్చిన వార్తల్లో కూడా ఎంత వరకూ నిజముందా అని ఆలోచిస్తున్నారు సినీజనాలు. వెంకటేష్ 75 వ సినిమా కూడా పూరీతోనే ఉంటుందని మరో ప్రచారం సాగుతోంది. ఈ మూడింటితో పాటు అమితాబ్ తో సినిమా పట్టాలెక్కిస్తానంటున్నాడు. మూడేసి నెలలకు ఒక సినిమా వదిలే కెపాసిటీ ఉన్న పూరీ, ఇన్ని సినిమాలు చేస్తున్నాడంటే మామూలు సమయంలో నమ్మచ్చు. కానీ పూరీ ఇప్పుడున్న ఫ్లాపుల నుంచి బయటపడితే తప్ప, ఈ స్టార్స్ సినిమాలేవీ పట్టాలెక్కే పొజీషన్ లేదు. బహుశా కళ్యాణ్ రామ్ సినిమాయే పూరీకి తనను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కావచ్చు. ఆ తర్వాతే ఏ స్టారైనా పూరీతో కమిట్ అవుతారు. ఒకవేళ ఫలితంతో సంబంధం లేకుండా, మహేష్, ఎన్టీఆర్, వెంకీ లు తమ సినిమాలు పూరీ డైరెక్షన్లో తెరకెక్కించడానికి సిద్ధపడితే మాత్రం, పూరీ మళ్లీ వెనకటి ఫామ్ లోకి వచ్చేసినట్టే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



