ఛార్మితో పూరికి పనిలేదిక!
on Jun 18, 2015
.jpg)
జ్యోతిలక్ష్మి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచీ.. ఛార్మీకి పూరి జగన్నాథ్‌కీ మధ్య ఎఫైర్ ఉందన్న గుసగుసలూ మొదలైపోయాయి. పూరి ఎక్కడున్నా ఛార్మి కూడా అక్కడే ప్రత్యక్షం అవ్వడం, జ్యోతిలక్ష్మి చిత్రంలో ఛార్మినీ పూరి ఓ పార్టనర్‌గా తీసుకోవడంతో ఈ వదంతులకు ప్రాణం వచ్చినట్టైంది.
ఛార్మి కూడా పూరి ఆఫీసులోనే మకాం పెట్టేయడంతో.. ఈ ఎఫైర్ ఓపెన్ సీక్రెట్ అనే రేంజులో ప్రచారం సాగింది. చార్మి వల్లే పూరి - నితిన్ ల సినిమా ఆగిపోయిందని, వరుణ్‌తేజ్ సినిమాకీ ఛార్మినే కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుందని గుసగుసలాడుకొన్నారు. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టాలని పూరి జగన్నాథ్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఇక మీదట తనకు సంబంధించిన వ్యవహారాల్లోగానీ, ఆఫీసు విషయాల్లో గానీ ఛార్మిని దూరంగా పెట్టాలని పూరి భావిస్తున్నాడట. అందుకే వరుణ్ తేజ్ సినిమా విషయంలో ఛార్మిని దూరంగా ఉండాలని సూచించడాట.
ఛార్మి కూడా పూరి ఆఫీసు ఖాళీ చేసి... తన అపార్ట్‌మెంట్‌కి షిష్ట్ అయిపోయినట్టు టాలీవుడ్ టాక్. జ్యోతిలక్ష్మి ముగిశాక కూడా పూరి - ఛార్మి లమధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని, నితిన్ వ్యవహారం తెరపై కొచ్చాక...పూరి ఛార్మిని దూరం పెట్టాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



