
ఈ మధ్య బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎక్కువ వార్తల్లోనే నిలుస్తున్నారు. ఒకప్పుడు ఎలాంటి విషయాలపై.. ఎలాంటి వార్తలో ఉండని ప్రియాంక.. ఎప్పుడైతే హాలివుడ్లో అడుగుపెట్టిందో.. అప్పటి నుండి ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు పాక్ నటీనటులను దేశం వదిలి వెళ్లిపోవాలని డిమాండ్లు వస్తున్న దానిపై స్పందించింది. ఇప్పటికే ఈ విషయమై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగా... దీనిపై మాట్లాడిన ప్రియాంక.. ‘నాకు దేశ భక్తి ఉంది.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే. కానీ ఈ విషయంలో కేవలం నటీనటులనే ఎందుకు లక్ష్యం చేయాలి? ఎలాంటి ఘటనలు జరిగినా లక్ష్యం చేసేది నటీనటులు, కళాకారులనే. వ్యాపారవేత్తలని, రాజకీయ నాయకులని, వైద్యులని ఎందుకు వేలెత్తి చూపరు? కానీ ఈ విషయంలో పాక్ నటీనటులు ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. అలాంటప్పుడు వారికి వ్యతిరేకంగా ఉండలేం కూడా. ఒకరు చేసిన పనికి వారినే శిక్షించాలి కానీ, వారి స్థానంలో కళాకారులని శిక్షించాలనుకోవడం తప్పు. అని చెప్పుకొచ్చింది. మరి ప్రియాంక మాటలు ఎంత దుమారం రేపుతాయో చూద్దాం..






