
ఈమధ్య మన హీరోలు తమ బుల్లి హీరోలతో కలిసి ఫొటోలు దిగుతూ సంబరపడిపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వారసుడు అయాన్ తో దిగిన ఫొటో ఒకటి షేర్ చేశాడు. అల్లు అయాన్‌ను ముద్దుగా ఒళ్లొ కుర్చోబెట్టుకుని చాలా సంతోషంగా ఉన్నారు. అయితే గతంలో అల్లు అర్జున్ ఇలాంటి ఫొటోలు పెట్టిన ఇప్పుడు పెట్టిన ఈ ఫొటో మాత్రం అభిమానులకి తెగ నచ్చేసింది. బన్నీ తన ఫేస్‌బుక్‌లో ఫొటోను షేర్ చేసిన 12 గంటల్లోనే లక్ష యాభైవేల మంది లైక్ చేశారు, 463 మంది కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దువ్వాడ జగన్నాథమ్’(డీజే) చిత్రంలో నటిస్తున్నారు.






