
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పక్కన ఐటెం సాంగ్ చేసిన లక్ష్మీరాయ్.. ఇప్పుడు చిరంజీవి పక్కన కూడా ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి నటిస్తున్న 150 వ చిత్రంలో లక్ష్మీరాయ్ చిరుతో కలిసి చిందేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె మెగాస్టార్‌తో కలిసి డ్యాన్స్ చేయనున్న ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. సెట్ లో చిరంజీవి తో దిగిన ఫొటో ఒకటి షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవిగారికి వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించాలన్న నా కల నిజమైంది. చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఉన్న గొప్ప వ్యక్తి. అలాంటి స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం చాలా చాలా సంతోషంగా ఉందంటూ’ చెప్పుకొచ్చింది లక్ష్మీరాయ్. మొత్తానికి పవన్ తో, చిరుతో చిందేసిన లక్ష్మీరాయ్ చరణ్ కలిసి ఎప్పుడు చిందేస్తుందో చూద్దాం..






