అ ఆ నితిన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్..!
on Jun 3, 2016
నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అ ఆ. నిన్న రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 8.18 కోట్లు కలెక్ట్ చేసి నితిన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది అ ఆ. ఓపెనింగ్స్ లో వచ్చిన ఈ జోరే ఈ వచ్చే వారం వరకూ కొనసాగితే, ఈ సమ్మర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. టోటల్ కలెక్షన్స్ ఏరియా వైజ్ షేర్ రిపోర్ట్. (కోట్లలో).
నైజాం 2.31
సీడెడ్ 0.75
కృష్ణా 0.40
గుంటూరు 0.49
తూర్పు గోదావరి 0.57
పశ్చిమ గోదావరి 0.41
నెల్లూరు 0.21
వైజాగ్ 0.45
ఆంధ్రా తెలంగాణా టోటల్ 5.59
యుఎస్ 1.85
కర్ణాటక 0.44
రెస్టాఫ్ ఇండియా 0.30
మొత్తం 8.18