చికెన్ ను కుమ్మేసిన ప్రియాంక చోప్రా
on Mar 5, 2016

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రా కు ఎన్నడూ ఇప్పుడు క్రేజ్ పీక్స్ లోకి చేరుకుంది. లేటెస్ట్ గా ఈ మాజీ విశ్వసుందరి, హాలీవుడ్ టాక్ షాల్లో కూడా ఇరగదీస్తోంది. చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన జిమ్మీ ఫాలన్ టాక్ షోకు గెస్ట్ గా వెళ్లిన ప్రియాంక, హోస్ట్ ఫాలన్ ను తనతో చికెన్ తినడంలో పోటీ పడమని ఛాలెంజ్ చేసింది. దీంతో, చికెన్ వింగ్స్ ను ఇరవై సెకన్లలో ఎవరు ఎక్కువ తింటారో, వాళ్లే గెలిచినట్టు అని పోటీ పెట్టుకుని తిన్నారు. టైం అయ్యేసరికి, ప్రియాంక ఫాలన్ కంటే ఎక్కువ ముక్కలు తిని విన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ప్రియాంక నటించిన జై గంగాజల్ సినిమా నిన్న రిలీజైంది. కాగా ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్ లో క్వాంటికీ టీవీ సీరీస్ తో పాపులర్ అయింది. బేవాచ్ అనే సినిమాలో, ప్రియాంక విలన్ గా చేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



