ప్రియమణి పెళ్లి డేట్ ఫిక్స్... పెళ్లి అక్కడా...?
on Aug 6, 2017
.jpg)
హీరోయిన్ ప్రియమణి పెళ్లి ముహూర్తం ఖరారైంది. తెలుగు తెరపై తన సత్తా చాటిన ప్రియమణి ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుతోంది. గత కొద్దికాలంగా తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ తో చెట్టా పెట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. ఆగస్టు 23న ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా రిజిస్టర్ ఆఫీసులో చాలా సింపుల్‌గా పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇక ఆగస్టు 24న బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో రిసప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ రిసెప్షన్‌కు సౌతిండియా సినీ తారలు తరలిరానున్నట్టు తెలుస్తోంది. కాగా ముస్తఫా ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆయణ్ని ప్రియమణి తొలిసారి ఓ డ్యాన్స్ షోలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



