Home

»

Latest News

Priya prakash varrier: కాషాయ డ్రెస్ వివాదం.. నెటిజన్లు ఫైర్

Aug 6, 2026 5:42PM

 

'ఒరు అదార్ లవ్' మూవీలోని  ఒకే ఒక్క చిన్నకన్ను కొట్టుడు'తో దేశవ్యాప్తంగా కోట్ల మంది కుర్రకారు హృదయాల్లో తిష్ట వేసిన భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పుడు ఈ మలయాళ ముద్దుగుమ్మ  మరోసారి వార్తల్లో నిలిచారు..అయితే, తాజాగా ఆమె పాల్గొన్న ఒక బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్‌లో ఎదురైన ఓ విచిత్రమైన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.  

ఇటీవల ప్రముఖ పర్సనల్ కేర్ బ్రాండ్ 'కుట్టికూర' (KuttyKura) ప్రమోషనల్ కార్యక్రమంలో ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కోసం ఆమె ఎంతో ఆకర్షణీయమైన ఆరెంజ్ (కాషాయం) రంగు దుస్తులను ధరించి హాజరయ్యారు. వేదికపై ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ సందడి చేసిన ప్రియాని  మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు పలు ప్రశ్నలు అడిగారు. అయితే, అక్కడికి వచ్చిన ఒక యూట్యూబర్ ఆమె వేసుకున్న డ్రెస్ రంగుపై అడిగిన  ప్రశ్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. "మీరు ఈ కాషాయ రంగు దుస్తులు ఎందుకు వేసుకున్నారు? బ్రాండ్ బాటిల్ రంగును చూసి ఈ డ్రెస్ ఎంచుకున్నారా? లేక కేరళలో ఆరెంజ్ అలర్ట్ ఉందనే ఉద్దేశంతో ఇలా వచ్చారా?" అంటూ  ప్రశ్నించాడు.  సదరు రిపోర్టర్ అడిగిన  ప్రశ్నకు ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతు  "నేను ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ థీమ్‌కు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా మాత్రమే ఈ డ్రెస్‌ను ఎంపిక చేసుకున్నాను" అని చాలా సింపుల్‌గా, పద్ధతిగా సమాధానమిచ్చి ఆ వివాదానికి అక్కడికక్కడే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. 

 

Also read: నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా?.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్ 

ప్రియా ఎంతో మెచ్యూర్డ్‌గా స్పందించినప్పటికీ, ఈ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి రాగానే క్షణాల్లో వైరల్‌గా మారింది.  ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం, నెటిజన్లు సదరు యూట్యూబర్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కంటెంట్ క్రియేషన్, వ్యూస్ కోసం ప్రముఖులను ఇలాంటి అర్థం లేని, వివాదాస్పద ప్రశ్నలు అడగడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఎవరు ఏ రంగు దుస్తులు ధరించాలనేది వారి సంపూర్ణ వ్యక్తిగత హక్కు. బ్రాండ్ ఈవెంట్‌లో బ్రాండ్ రంగుకు తగ్గట్టు దుస్తులు వేసుకోవడంలో తప్పు ఏముంది?" అంటూ ప్రియా వారియర్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో 'చెక్‌', 'ఇష్క్‌', పవన్ కళ్యాణ్ 'బ్రో' వంటి సినిమాలతో మెప్పించిన ప్రియా రీసెంట్‌గా 'కజిన్స్ అండ్ కల్యాన్స్' వెబ్ సిరీస్‌తో అలరించింది.ప్రస్తుతం 'త్రి మంకీస్', 'లవ్ హ్యాకర్స్' వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీ.

Priya prakash varrier, Tollywood, Kollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com