Home

»

Latest News

వైరల్ మారిన డెమాన్ పవన్, రీతూ చౌదరి 'బంగారం' సాంగ్.! 

Aug 6, 2026 5:48PM

బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన 'బంగారం' ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మెలోడీ, విజువల్స్, ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మొదటి నుంచి చివరి వరకు ఫీల్‌గుడ్ రొమాంటిక్ వైబ్‌తో సాగే ఈ పాటలో డెమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా ఉండటంతో ఈ పాటను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదిస్తున్నారు.

ఈ పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడంతో పాటు స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. సమీరా భరద్వాజ్ వోకల్స్ పాటకు మరింత అందం తీసుకొచ్చాయి. ముఖ్యంగా రంజిత్ రెడ్డి అందించిన మ్యూజిక్ ఈ పాటకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. మెలోడీ, బీట్‌లు, అరేంజ్‌మెంట్ అన్నీ కలిసి పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశాయి.

మంచి మ్యూజిక్, ఆకట్టుకునే విజువల్స్, ఫ్రెష్ కెమిస్ట్రీతో 'బంగారం' సాంగ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పాట సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో చోటు సంపాదించుకుంది.

 

Demon Pavan, Rithu Chowdhary, Bangaram Song

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com