లెక్చరర్ గా ప్రిన్స్ మహేష్ బాబు
on Jan 4, 2012
లెక్చరర్ గా ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ "దూకుడు" చిత్రాన్ని నిర్మించిన రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, అనీల్ సుంకర మళ్ళీ మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ చిత్రంలో కూడా ప్రిన్స్ మహేష్ బాబే హీరో కావటం విశేషం. లెక్కల మాస్టారు దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వారు ఒక చక్కని చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు.
ఈ చిత్రానికి స్క్రిప్ట్ తయారయ్యిందట. లెక్కల లెక్చరర్ గా తన నిజ జీవితానుభవాలను జోడించి సరదాగా ఉండేలా దర్శకుడు సుకుమార్ ఈ కథని రూపొందించారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు లెక్చరర్ గా నటించనున్నారట. ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభం కానుందట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
