'ప్రేమ్ కుమార్' పబ్లిక్ టాక్.. బాబూ శోభన్ ఇంకెన్నాళ్ళీ దండయాత్ర!
on Aug 18, 2023

'వర్షం' దర్శకుడు శోభన్ తనయుడు అనే ట్యాగ్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సంతోష్ శోభన్. కథానాయకుడిగా విభిన్న ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడీ యంగ్ హీరో. ఈ క్రమంలోనే.. అతని నుంచి వచ్చిన తాజా చిత్రం 'ప్రేమ్ కుమార్'. 'కళ్యాణం కమనీయం', 'శ్రీదేవి శోభన్ బాబు', 'అన్నీ మంచి శకునములే' తరువాత 2023లో శోభన్ నుంచి వచ్చిన నాలుగో చిత్రమిది. ఆసక్తికరమైన ప్రచారాలతో ఆకట్టుకున్న ఈ సినిమా.. శుక్రవారం (ఆగస్టు 18) జనం ముందుకు వచ్చింది.
కథేంటి: పీటల మీద పెళ్ళి ఆగిపోవడంతో పాటు మరెన్నో పెళ్ళి ప్రయత్నాలు విఫలమవడంతో.. ఫ్రస్ట్రేషన్ లోకి వెళతాడు పీకే అలియాస్ ప్రేమ్ కుమార్. దీంతో ప్రేమలు, పెళ్ళిళ్ళు బ్రేకప్ చేయడమే లక్ష్యంగా చేసుకుని 'పీకే డిటెక్టివ్ ఏజెన్సీ' నడపడం ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలోనే.. ప్రేమ్ కుమార్ చెడగొట్టడానికి ప్రయత్నించిన ఓ పెళ్ళి.. తన జీవితాన్ని ఊహించని విధంగా మలుపులు తిప్పుతుంది. మరి.. చివరకి పీకే ఒక ఇంటివాడయ్యాడా? లేదా? అనేది మిగిలిన సినిమా.
పబ్లిక్ రెస్పాన్స్ ఏంటంటే: 'ప్రేమ్ కుమార్' ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే తెరకెక్కినా.. పూర్తిస్థాయి వినోదాన్ని అందించలేకపోయిందన్నది ప్రేక్షకుల మాట. దర్శకుడు అభిషేక్ మహర్షి సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని అంటున్నారు. సాంకేతికంగానూ మూవీ చాలా వీక్ గా ఉందంటున్నారు. అలాగే ఎలాగైనా హిట్టు కొట్టాలని వరుస సినిమాలతో పలకరిస్తున్న శోభన్ ని ఉద్దేశించి.. "బాబూ ఇంకెన్నాళ్ళీ దండయాత్ర" అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఓవరాల్ గా.. ఇది కమర్షియల్ గా వర్కవుట్ అవడం కష్టమేనంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



