Home

»

Latest News

'మా' ఎన్నికల నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్.. పవన్ వ్యాఖ్యలపై రియాక్షన్!

Sep 27, 2021 1:31PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.

సోమవారం ఉదయం ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు. ఆయన ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ కూడా నామినేషన్ వేశారు. అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. 900 మంది ఉన్న అసోసియేషన్ ఇది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడిపోతారో అనేది ఓటు హక్కుతో నిర్ణయిస్తారన్నారు‌. తాము అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తున్నామని.. రాజకీయ పార్టీల జోక్యం ఎవరు చేస్తున్నారో తెలీదని అన్నారు. ఇది రాజకీయ ఎలక్షన్స్ కాదని.. ఇది కేవలం సినిమా ఎలక్షన్స్ అని స్పష్టం చేశారు. అక్టోబర్ 3న తమ మేనిఫేస్టో ప్రకటిస్తానన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మాటల్లో ఆవేశం మరియు అర్థం రెండు ఉన్నాయని ప్రకాష్ రాజ్ అన్నారు.

కాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సినీ పరిశ్రమ జోలికి రావొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com