Home

»

Latest News

రాజ‌మౌళి తొలి చిత్రం `స్టూడెంట్ నెం: 1`కి 20 ఏళ్ళు!

Sep 27, 2021 2:29PM

తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన ద‌ర్శ‌కుల్లో ఎస్. ఎస్. రాజ‌మౌళి ఒక‌రు. `బాహుబ‌లి` సిరీస్ తో జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ద‌ర్శ‌క‌ధీరుడు.. అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని నిర్దేశ‌కుడిగా తెలుగునాట‌ గుర్తింపు పొందారు. అలాంటి రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా వేసిన తొలి అడుగు.. `స్టూడెంట్ నెం: 1` (2001). నేటితో (సెప్టెంబ‌ర్ 27) ఈ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ విడుద‌లై స‌రిగ్గా 20 ఏళ్ళు. ఈ సంద‌ర్భంగా ఆ జ్ఞాప‌కాల్లోకి వెళితే..

* `నిన్ను చూడాల‌ని` (2001)తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కి కెరీర్ లో తొలి ఘ‌న‌విజ‌యం `స్టూడెంట్ నెం: 1`. త‌న‌కిది క‌థానాయ‌కుడిగా రెండో సినిమా. ఇక‌ ఈ చిత్రం త‌రువాత రాజ‌మౌళి కాంబినేష‌న్ లో చేసిన `సింహాద్రి` (2003), `య‌మ‌దొంగ‌` (2007) కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేసి.. వీరిని `హ్యాట్రిక్ కాంబో`గా నిలిపాయి. త్వ‌ర‌లో వీరి క‌ల‌యిక‌లో రూపొందిన నాలుగో చిత్రం `ఆర్ ఆర్ ఆర్`  థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

* `అన్న‌మ‌య్య‌`(1997) త‌రువాత ఆశించిన విజ‌యాల్లేని స్వ‌ర‌వాణి కీర‌వాణిని మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన చిత్రం `స్టూడెంట్ నెం: 1`. ఇందులోని ఆరు పాట‌లు కూడా చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి. ఇప్ప‌టికీ ఇందులోని గీతాలు ఎక్క‌డో చోట వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు.. సినిమాలో ఫేర్ వెల్ సాంగ్ గా తెర‌కెక్కిన‌ ``ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి`` పాట‌తో `ఉత్త‌మ గాయ‌కుడు`గా `నంది` పుర‌స్కారం అందుకున్నారు కీర‌వాణి. ఇక త‌న త‌మ్ముడు రాజ‌మౌళి తొలి చిత్రం నుంచి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వ‌ర‌కు క‌లిసి ప్ర‌యాణం చేస్తున్నారు.

* `స్టూడెంట్ నెం: 1`కి ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ వ‌హించారు.

* స్వ‌ప్న సినిమా ప‌తాకంపై నిర్మిత‌మైన తొలి చిత్రం `స్టూడెంట్ నెం: 1`. ఆపై ప‌లు చిత్రాల‌ను నిర్మించిన ఈ సంస్థ‌.. `మ‌హాన‌టి` (2018)తో మ‌రో స్థాయికి వెళ్ళింది.

* ఎన్టీఆర్ కే కాదు క‌థానాయిక గ‌జాలాకి కూడా ఇది రెండో సినిమానే. ఆ త‌రువాత వీరిద్ద‌రు `అల్ల‌రి రాముడు` (2002)లో అల‌రించారు.

* `స్టూడెంట్ నెం: 1` 40 ప్రింట్ల‌తో విడుద‌లై 73 కేంద్రాల‌లో 50 రోజులు, 42 కేంద్రాల‌లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైంది.

* ఈ చిత్రాన్ని త‌మిళంలో `స్టూడెంట్ నెం: 1` పేరుతోనూ, ఒడియాలో `మాటే ట ల‌వ్ హెల‌రే` పేరుతో రీమేక్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com