Home

»

Latest News

టాలీవుడ్‌లో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో డైరెక్ట‌ర్ భార్య క‌న్నుమూత‌.!

Sep 27, 2026 8:32AM

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు, రచయిత ప్రదీప్ అద్వైతం భార్య దీప్తి రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆమె మృతి చెందినట్లు సమాచారం. దీంతో ప్రదీప్ అద్వైతం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రదీప్ అద్వైతం టాలీవుడ్‌లో రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో ఆయన పేరు ప్రేక్షకులకు మరింత చేరువైంది. మాహి వి. రాఘవ్‌తో కలిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ప్రదీప్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

ఇక దీప్తి రెడ్డి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తే. వివిధ రంగాల్లో పనిచేసిన ఆమెకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రదీప్ అద్వైతంతో కలిసి కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె.. తాజాగా అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ముఖ్యంగా ఊహించని విధంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె మృతి చెందడం సన్నిహితులను కలచివేసింది.

దీప్తి రెడ్డి మృతితో ప్రదీప్ అద్వైతంకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఇలా హఠాత్తుగా దూరం కావడం బాధాకరమని సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విషాద వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 

[Pradeep Advaitham Wife, Deepthi Reddy Death, Pradeep Advaitham, Deepthi Reddy Brain Stroke, Tollywood Director Pradeep Advaitham, Telugu Cinema News, Tollywood Latest News, Save The Tigers Director]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com