Home

»

Latest News

అక్కడే నా ఇగో దెబ్బతింది: శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు కామెంట్స్.! 

Sep 26, 2026 6:50PM

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'ది ప్యారడైజ్'. ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో మోహన్ బాబు నటించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ కి మరోసారి విజిల్స్ పడుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా 'ప్యారడైజ్' ప్రెస్ మీట్ లో మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. అలాంటి మోహన్ బాబు.. కొన్ని కొన్ని విషయాలు మాట్లాడాలని అనిపించినా, మాట్లాడలేకపోతున్నాని 'ప్యారడైజ్' ప్రెస్ మీట్ లో అన్నారు. ఏం మాట్లాడినా తమ విద్యాసంస్థల్లో చదువుతున్న వేలాది విద్యార్థులకు చెడ్డపేరు వస్తుందని, అందుకే సైలెంట్ గా ఉంటున్నట్లు మోహన్ బాబు చెప్పారు.

ఇక 'ప్యారడైజ్' గురించి మాట్లాడుతూ.. నానిని మేము అప్పుడప్పుడు తలచుకుంటూ ఉంటామని, మా కుటుంబంలో నానిని ప్రేమించేవారు ఉన్నారని మోహన్ బాబు తెలిపారు. అలాగే శ్రీకాంత్ ఓదెల గురించి ఆయన చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. "దర్శకుడు శ్రీకాంత్ నన్ను కలిసి కథ చెప్పాడు. నువ్వు చెప్తున్నావు సరే, ఇందులో హీరో నాని కదా.. నువ్వు నానిని అడిగావా అన్నాను. మా అన్న పర్మిషన్ తీసుకునే వచ్చాను అన్నాడు. అక్కడ కొట్టింది నాకు ఇగో. నన్ను సినిమాలో పెట్టుకోవడానికి నాని రికమెండేషన్ తో వచ్చావా.. అని మనసులో అనుకున్నాను. ఏదేమైనా నాని పర్మిషన్ తో వచ్చాడు కాబట్టి.. థాంక్యూ నాని" అని మోహన్ బాబు అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.

అలాగే శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసలు కూడా కురిపించారు మోహన్ బాబు. "దర్శకుడిగా శ్రీకాంత్ టాలెంట్ చూసి గర్వించాను. అతని టాలెంట్ గురించి ఎందరికో చెప్పాను." అన్నారు.

ఇది కూడా చదవండి: నాని అన్నతో గొడవలు నిజమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.!

 

 

 

[Mohan Babu About Srikanth Odela, Mohan Babu Speech, The Paradise Movie, Nani Paradise, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu, Kayadu Lohar, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com