రామ్ చరణ్ తో ప్రభుదేవా కలిశాడు!
on Feb 16, 2023

ప్రభుదేవా దర్శకునిగా మారిన తర్వాత తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రాలకు తప్పితే బయట పెద్దగా కొరియోగ్రఫీ చేయడం లేదు. ఆయన కొరియోగ్రఫీ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15 చేస్తున్నారు. ఇది చరణ్ కు 15వ చిత్రం కావడంతో అదే వర్కింగ్ టైటిల్‌ని కొనసాగిస్తున్నారు. సినిమా షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ సాగుతోంది. చెర్రీ కియారా అద్వానీలతో న్యూజిలాండ్ లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో ఓ పాటను తెరకెక్కించారు. తాజాగా రెండో పాటను షూట్ చేస్తున్నారు. ఇందులో చరణ్ అదిరిపోయేస్టెప్పులు వేస్తున్నారు. ఈ పాట కోసం ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయనతో పాటు సాండీ మాస్టర్లు సంయుక్తంగా కొరియోగ్రఫీ చేయనుండడం విశేషం.
ప్రభుదేవా, శాండీ, బాస్కో సీజర్ వంటి వారు పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. స్టార్ కొరియోగ్రాఫర్లు డాన్స్ కంపోజ్ చేస్తున్నారని తెలియడంతో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అదిరిపోయే డ్యాన్సులు ఉండబోతున్నాయని పండగ చేసుకోవచ్చని భావిస్తున్నారు. శంకర్ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్ లో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీఎం క్యాండిడేట్గా చరణ్ నటించబోతున్నారు. ఈ పార్టీ కోసం చరణ్ ప్రచారం చేసే సన్నివేశాలతో నిన్నటి కి నిన్న ఓ పాట షూటింగ్ హైదరాబాదులో సాగింది. చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సెట్స్ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ సినిమాలో సూపర్ సాంగ్స్ తో అదిరిపోయే డ్యాన్సులో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. అంజలీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు అమ్మాయి అంజలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ కు భార్యగా కనిపించునున్నారు. హీరో శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రవిచంద్ర తదితరులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



