Home

»

Latest News

ఘనంగా ప్రభాస్ పెళ్లి: ఎప్పుడు?.. ఎక్కడ.?

Nov 9, 2026 5:59PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వస్తే అభిమానుల్లో ఆసక్తి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా ఓ వార్త తెరపైకి వచ్చింది. కాకపోతే ఇది నిజ జీవితంలో కాదు.. సినిమా కోసమే!

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. ‘సీతారామం’తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ స్పై పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫౌజీ’ కొత్త షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రభాస్, ఇమాన్వీలపై ఓ భారీ పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ కోసమే ప్రభాస్ నవంబర్ 7న షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లి ఘట్టం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను రూపొందించారట. 1940ల కాలం నాటి వాతావరణం, అప్పటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా ఈ సన్నివేశాన్ని ప్లాన్ చేసినట్లు టాక్. హను రాఘవపూడి తనదైన విజువల్ స్టైల్‌లో ఈ సీన్‌ను తెరకెక్కిస్తున్నారట. మరి ప్రభాస్ పెళ్లి కొడుకు గెటప్‌లో ఎలా కనిపిస్తారో చూడాలంటే సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ రావాల్సిందే.

ఇది కూడా చదవండి: మహేష్ మెచ్చిన ‘సీన్’.. సూపర్ స్టార్ రివ్యూలో ఏముందంటే.?

ఇక ‘ఫౌజీ’లో ఇమాన్వితో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘సీతారామం’కు అద్భుతమైన సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ప్రభాస్, ఇమాన్వి జంటగా కనిపించనున్న ప్రేమకథ, ఈ పెళ్లి సన్నివేశం సినిమాలో ఎలాంటి మలుపు తీసుకొస్తాయో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నిజ జీవితంలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడన్నది పక్కన పెడితే.. ‘ఫౌజీ’లో మాత్రం డార్లింగ్ పెళ్లి సందడి మొదలైందన్నమాట.

మీకు నచ్చవచ్చు:
‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా.?
వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!

 

 

 

[Prabhas Wedding Scene in Fauzi, Prabhas Fauzi Wedding Scene, Prabhas Wedding, Prabhas Marriage, Prabhas Fauzi Movie, Prabhas Imanvi, Hanu Raghavapudi, Mythri Movie Makers]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com