Home

»

Latest News

ఆల్ టైం వరల్డ్ రికార్డు సృష్టించిన రామాయణ:గంటకి ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలుసా!

Nov 9, 2026 5:39PM

లోక కళ్యాణం కోసం అయోధ్య రాముడు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కున్నాడో గాని వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పెద్దగా కష్టం( భారీ ప్రమోషన్స్) లేకుండానే భారీ కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు.దీంతో అరుదైన రికార్డులు తన ఖాతాలో చేరుతున్నాయి. 

ముఖ్యంగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ 'బుక్‌మైషో' (BookMyShow) లో సృష్టిస్తున్న రికార్డులు చూస్తే టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. విడుదలైన తొలి రోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఊపందుకున్న ఈ జోరు, థియేటర్లలోకి వచ్చాక మరింత తీవ్రమైంది.

 ట్రెండ్ అనాలసిస్ ప్రకారం, బుక్‌మైషోలో కేవలం గంట వ్యవధిలోనే సుమారు 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడై అప్పట్లోనే సంచలనం సృష్టించగా, ఆ తర్వాత ఈ వేగం మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా వీకెండ్ ముగిసిన తర్వాత కూడా సోమవారం వర్కింగ్ డే రోజున ఉదయం కేవలం ఒకే గంటలో ఏకంగా 1 లక్ష టికెట్లు అమ్ముడై ఆల్‌టైమ్ బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది. 

 

ఇది కూడా చదవండి: సాయి ధరమ్ తేజ్ ని మోసం చేసిన హీరోయిన్ ఆమెనేనా!: అందుకే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదా!

సాధారణంగా వీక్‌డేస్‌లో సినిమా టికెట్ల అమ్మకాలు మందగిస్తుంటాయి, కానీ 'రామాయణం' విషయంలో మాత్రం ఈ రూల్ పూర్తిగా తల్లకిందులైంది.   తొలి నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) పైచిలుకు టికెట్ల సేల్స్ నమోదు చేస్తూ ఈ రేర్ ఎలైట్ క్లబ్‌లో స్థానం సంపాదించుకున్న మూడవ చిత్రంగా 'రామాయణం' నిలిచింది.

 

ఈ దూకుడు ఇలాగే కొనసాగితే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 500 కోట్ల ని దాటి బాక్స్ ఆఫీస్ పై తన హవా చాలా బలంగా చాటుతూ ఉంది.

 

 

మీకు నచ్చవచ్చు:రామాయణ మూవీ రివ్యూ 
మీకు నచ్చవచ్చు: గత రామాయణ చిత్రాలకి ఇప్పటి రామాయణకి ఉన్న తేడా ఇదే!


[Ramayana Movie Bookmyshow Record, Ramayana movie, BookMyShow records, Ramayana box office collections, Ranbir Kapoor Ramayana, Nitesh Tiwari film, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com