Home

»

Latest News

మూడు రోజులకి సీన్ కొట్టిన రికార్డు కలెక్షన్స్ ఇవే: మరి బ్లాక్ బస్టర్ అంటున్నారుగా!

Nov 9, 2026 6:07PM


సూర్య సీన్ మూవీ దెబ్బకి అభిమానులకి, ప్రేక్షకులకి ప్రెజెంట్ ఎట్మా స్పియర్  'వింటర్' గానే ఉన్నా బాక్స్ ఆఫీస్ మాత్రం ఉక్కపోతకి గురవుతూ ఉంది. కాకపోతే ప్రేమతో కూడిన ఉక్కపోత. మరి వరుస మూడు వైవిద్యభరితమైన చిత్రాలంటే మాటలా చెప్పండి.   


జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ, కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 145 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

సూర్యతో పాటు మిగతా నటీనటుల నటన దర్శకుడు జీతూ మాధవన్  మేకింగ్ స్టైల్ ఇంటెన్స్ సన్నివేశాలు బలంగా ప్రేక్షకులని  ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ స్థాయి కలెక్షన్స్ .

 

ఇది కూడా చదవండి: ఆల్ టైం వరల్డ్ రికార్డు సృష్టించిన రామాయణ:గంటకి ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలుసా!

దీంతో రాబోయే రోజుల్లో ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఎండింగ్ ఫిగర్ ఎంత ఉండవచ్చనే చర్చలు మొదలయ్యాయి. అభిమానులు అయితే గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కావాలని కోరుకుంటున్నారు. మరి ఊపు చూస్తుంటే అభిమానుల కల నెరవేరడం పెద్ద కష్టమైన  పని కాదు. 


 సూపర్‌స్టార్ మహేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'సీన్' చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించిన మహేష్ బాబు, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన రివ్యూను పంచుకున్నారు. సూర్య అద్భుతమైన నటనను కనబరిచారని, ముఖ్యంగా ఇన్‌బరాజ్ (Inbaraj) గా  సూర్య అభినయం అసాధారణంగా ఉందని కొనియాడారు.

దర్శకుడు జీతూ మాధవన్ టేకింగ్ విధానాన్ని ప్రశంసిస్తూ, ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక 'కూల్, స్మార్ట్ అండ్ ఫన్' మస్ట్ వాచ్ మూవీ అని మహేష్ బాబు అభివర్ణించారు.మహేష్ బాబు లాంటి అగ్ర హీరో స్వయంగా సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేయడంతో 'సీన్' సినిమాపై ఒక్కసారిగా హైప్ విపరీతంగా పెరిగిపోయింది. 

 

మీకు నచ్చవచ్చు: సీన్ మూవీ రివ్యూ!
మీకు నచ్చవచ్చు: రామాయణ మూవీ రివ్యూ 

 

[Suriya Scene movie collections, scene movie collections, Mahesh Babu review By Scene Movie, Scene Movie Box office collections, Jithu Madhavan film, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com