ఆ మూవీ ఒక యానిమేషన్ ప్రాజెక్ట్! ప్రభాస్ పై బాలీవుడ్ మీడియా ప్రచారం!
on Nov 16, 2025

బాలీవుడ్ మీడియా ప్రభాస్ పై ప్రచారం
నాటు నాటుతో ప్రేమ్ రక్షిత్ ఫేమస్
యువి క్రియేషన్స్ కి ప్రభాస్ కి మధ్య అనుబంధం
జోరు పెంచిన ప్రభాస్
వరుస ప్రాజెక్ట్స్ విషయంలో 'తగ్గేదేలే' అనే విధంగా పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)ముందుకు దూసుకుపోతున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇండియన్ చిత్ర సీమలో ఏ హీరో కూడా ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న దాఖలాలు లేవు. 'రాజాసాబ్'(The Raja Saab)సెట్స్ పై ఉండగానే హను రాఘవపూడి(Hanu Raghavapudi)తో 'ఫౌజి'(Fouji)అనౌన్స్ చేసాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. సదరు చిత్రం సెట్స్ పై ఉండగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. సందీప్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే అందుకు ఆస్కారం ఉందని అనిపిస్తుంది.
ఇప్పుడు ప్రభాస్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ వార్తలు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో కాకుండా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా జరుగుతున్నాయి. బాలీవుడ్ మీడియా సైతం తమ ఫోకస్ ని ఆ కొత్త చిత్రంపై ఉంచింది. వాళ్ళ మాటల ప్రకారం ప్రభాస్ కి ప్రముఖ నృత్య దర్శకుడు 'ప్రేమ్ రక్షిత్'ఒక కథ వినిపించాడని స్క్రిప్ట్ ప్రభాస్ కి నచ్చడంతో చర్చలు జరుగుతున్నాయనేది బాలీవుడ్ మీడియా వర్గాల టాక్. సదరు మూవీ యానిమేషన్ ప్రాజెక్ట్ అని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్(UV Creastions)డీల్ చేస్తుందనే టాక్ ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో యువి క్రియేషన్స్ అగ్ర నిర్మాణ సంస్థ గా ఉంది.
మెగాస్టార్ తో విశ్వంభర నిర్మిస్తుంది ఈ సంస్థనే. ఈ సంస్థ నిర్మించే సినిమాలకి సంబంధించిన కథలన్ని ప్రభాస్ వింటూ ఉంటాడనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. అంత అనుబంధం ప్రభాస్ తో ఉంది. మిర్చి తోనే సిల్వర్ స్క్రీన్ పై యువి ప్రతినిధులు అడుగుపెట్టారు. ప్రేమ్ రక్షిత్ చెప్పిన కథ కూడా ఈ సంస్థ కోసమే ప్రభాస్ కి చెప్పాడని, హీరోగా ప్రభాస్ ఉండడని, వేరే వాళ్ళు ఉంటారనే మరో టాక్ కూడా అక్కడి మీడియా వర్గాల్లో వినపడుతుంది.
Also Read: మహేష్ బాబు కారుకి చెలనాలు విధించిన పోలీసులు
ఏది ఏమైనా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ యువి క్రియేషన్స్ కి సంబంధించిన కథ వినడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వేళ స్పిరిట్ తర్వాత ప్రభాస్ సదరు సంస్థకి, ప్రేమ్ రక్షిత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేమో కూడా చూడాలి. కొన్ని రోజులు ఆగితే కానీ ఈ ప్రాజెక్ట్ పై పూర్తి డిటైల్స్ బయటకి రావు. ప్రేమ్ రక్షిత్ మాత్రం నృత్య దర్శకుడిగా సినీ పరిశ్రమలో తనకంటు ఒక ప్రత్యేకతని చాటుకున్నాడు. ఆస్కార్ అవార్డు అందుకున్న 'నాటునాటు' సాంగ్ ప్రేమ్ రక్షిత్(Prem Rakshith) నృత్య దర్శకత్వంలోనే తెరకెక్కింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



