ఈ కాంబో సూపర్ గురూ..!
on Mar 10, 2016
ఆ జంట కలిసి కనబడితే, ఆ కిక్కే వేరప్పా..వాళ్లిద్దరూ కలిసి నటిస్తే, సినిమా హిట్టే. ఇలా అనిపించిందంటే, అది హిట్ పెయిరే..బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మన్ కలర్ సినిమాల్లో ఎక్కువగా జంటలు ఆన్ స్క్రీన్ కనువిందు చేశారు. కానీ అలాంటి హిట్ పెయిర్స్ ఈ జనరేషన్లో కూడా ఉన్నారండోయ్..సరదాగా ఓ లుక్కేద్దాం రండి
నాగార్జున - రమ్యకృష్ణ

వీళ్లిద్దరి కాంబినేషన్ ఎవర్ గ్రీన్. లేటెస్ట్ గా సోగ్గాడే చిన్ని నాయనాతో వీళ్ల మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయింది. ఇదే కాంబినేషన్లో, క్రిమినల్, హలో బ్రదర్, అన్నమయ్య లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.
వెంకటేష్ - మీనా

ఈ ఇద్దరి కాంబినేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్. సుందరాకాండ, చంటి, అబ్బాయి గారు లాంటి సినిమాల నుంచి నిన్న మొన్న వచ్చిన దృశ్యం వరకూ, ఆన్ స్క్రీన్ సూపర్ కాంబినేషన్.
నాగచైతన్య - సమంత

ఇద్దరి ఆరంగేట్రం ఏ మాయ చేశావే తో మొదలైంది. మొదటి సినిమాలోనే అదిరిపోయే కెమిస్ట్రీతో వావ్ అనిపించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం తో మురిపించారు. లేటెస్ట్ గా మరో సినిమాలో ఇద్దరూ జత కట్టబోతున్నారని సమాచారం. యంగ్ హీరోస్ లో సమంత తో చైతూ కెమిస్ట్రీ అదుర్స్.
రామ్ చరణ్ - కాజల్

చరణ్ కెరీర్లో ఆల్ టైం బెస్ట్ మగధీర. కాజల్ ను కూడా స్టార్ హీరోయిన్ గా మార్చేసిందీ మూవీ. అప్పటి నుంచి వీళ్లిద్దరి కెమిస్ట్రీ కుమ్మేస్తోంది. మగధీర, ఎవడు, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాలతో బెస్ట్ స్క్రీన్ కపుల్ గా ప్రూవ్ చేసుకున్నారు.
ప్రభాస్ - కాజల్

ప్రభాస్ పక్కన కూడా కాజలే మంచి నాయికగా ప్రూవ్ చేసుకుంది. డార్లింగ్, మిస్టర్ పెర్ ఫెక్ట్ సినిమాల్లో, వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ లవ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది.
మహేష్ బాబు - సమంత

మహేష్ కు ఈ మధ్యకాలంలో, సమంతతో ఉన్నట్లుగా వేరే ఏ హీరోయిస్ తో కెమిస్ట్రీ లేదు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సినిమాల్లో, ఇద్దరి కాంబినేషన్ సూపర్ అనిపించింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవంలో కూడా ఈ జంట కనువిందు చేయబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



