'ఆదిపురుష్' మిస్ అయింది.. సంక్రాంతి బరిలో 'ప్రాజెక్ట్ కె'!
on Feb 16, 2023

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతికి 'ఆదిపురుష్'తో అలరించాలి అనుకున్నాడు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఆ చిత్రం జూన్ కి వాయిదా పడింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం 'ప్రాజెక్ట్ కె'తో ప్రభాస్ సందడి చేయడం దాదాపు ఖరారైందని అంటున్నారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ప్రాజెక్ట్ కె'. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని తదితరులు నటిస్తున్నారు. ఇండియన్ అవెంజర్స్ గా ప్రచారం పొందుతూ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీ ఖరారైందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని రానుందని సమాచారం. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు వినికిడి. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా లేదా అనే విషయంపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారట.
సంక్రాంతికి 'ప్రాజెక్ట్ కె' విడుదలైతే కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ప్రభాస్ నటించిన మూడు భారీ సినిమాలు చూడొచ్చు. ఇప్పటికే జూన్ 16న 'ఆదిపురుష్', సెప్టెంబర్ 28న 'సలార్' విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'ప్రాజెక్ట్ కె' సంక్రాంతికి వస్తే.. కేవలం ఏడు నెలల గ్యాప్ లో ప్రభాస్ నుంచి మూడు భారీ సినిమాలు వచ్చినట్లు అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



