
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఒకవైపు ఉంటే.. ప్రభాస్‌ను వంగా ఏ రేంజ్‌లో చూపించబోతున్నారనే క్యూరియాసిటీ మరోవైపు ఉంది. ఇప్పుడు ప్రభాస్ పాత్రకు సంబంధించి వస్తున్న కొత్త సమాచారం ఈ అంచనాలను మరింత పెంచుతోంది.
సాధారణంగా పోలీస్ కథ అంటే నిజాయితీగల పోలీస్.. విలన్లను పట్టుకోవడం.. చివర్లో పెద్ద యాక్షన్ బ్లాక్ అనే ఫార్మాట్‌లో సినిమాలు వస్తుంటాయి. కానీ ‘స్పిరిట్’ విషయంలో సందీప్ రెడ్డి వంగా ఆ రెగ్యులర్ ఫార్ములాను ఫాలో కావడం లేదట. ప్రభాస్ పాత్రలో డార్క్ గ్రే షేడ్స్ ఉంటాయని టాక్.
ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రల్లో చూడని రీతిలో ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం. ప్రభాస్ పాత్రను వైల్డ్‌గా, ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. పాత్రలో ర్యాష్‌నెస్, నెగెటివ్ షేడ్స్ కనిపించినప్పటికీ.. దాని వెనుక బలమైన కారణం, ఎమోషనల్ జస్టిఫికేషన్ ఉంటుందట.
ఇక ‘స్పిరిట్’లో ప్రభాస్ లుక్ కూడా చాలా కీలకంగా ఉండబోతుందట. ఫస్ట్ హాఫ్‌లో ఒక రకమైన లుక్‌లో కనిపిస్తే.. సెకండ్ హాఫ్‌లో పూర్తిగా మరో అవతార్‌లో కనిపిస్తారని సమాచారం. కథలో జరిగే కీలక పరిణామాల కారణంగా ప్రభాస్ లుక్‌లో ఈ భారీ మార్పు వస్తుందట.
అంటే ఇది కేవలం మేకోవర్ కోసం చేసే మార్పు కాకుండా.. పాత్రలో వచ్చే ఎమోషనల్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూపించడానికి ఉపయోగించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌లో గాయాలతో ఉన్న ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్‌కు ఈ వార్త మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

అసలు కథ విషయానికి వస్తే.. ఒకప్పుడు ఉన్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి జీవితం ఒక్కసారిగా ఎలా తలకిందులైంది? తన సర్వీస్‌కు, సమాజానికి దూరమైన తర్వాత అతను తన జీవితాన్ని ఎలా తిరిగి నిర్మించుకున్నాడు? అనే అంశాల చుట్టూ కథ సాగుతుందని టాక్. ఈ జర్నీలో ఈగో, ఎమోషన్స్, రిడెంప్షన్ వంటి అంశాలు కీలకంగా ఉంటాయని సమాచారం.
‘స్పిరిట్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను 2027, మార్చి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఫటా పటాకా.. యామీ గౌతమ్ జాంబీ డ్యాన్స్ అదిరిపోయిందిగా.!
[Prabhas Looks In Spirit, Prabhas Spirit Story, Prabhas Cop Role, Prabhas As Police, Rebel Star Prabhas, Sandeep Reddy Vanga, Telugu Film News]




