Home

»

Latest News

'ఈ సినిమా తెలుగులో డ‌బ్ అయితే మిస్ అవ్వొద్దు..' విజ‌య్ సేతుప‌తి సినిమాపై  ప్ర‌శంస‌లు.!

Oct 6, 2026 3:29PM

సినిమాకు భాషతో సంబంధం లేదని మరోసారి నిరూపిస్తోంది తమిళ చిత్రం ‘బత్తా’. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటనతో పాటు కథను దర్శకుడు బాలాజీ ధరణీధరన్ నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘బత్తా’ ఒకటంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

1986 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు. అయితే గ్యాంగ్‌స్టర్ కథ అనగానే కత్తులు, కొట్లాటలు, రక్తపాతం ఎక్కువగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. ఇందులో కామెడీ, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బత్తా అనే గ్యాంగ్‌స్టర్‌ను ఓ చిన్నారి అనుకోకుండా స్కూల్ బాత్రూమ్‌లో బంధించడంతో కథలో అసలు మలుపు మొదలవుతుంది. బయట ప్రపంచంలో అందరూ భయపడే వ్యక్తి.. ఓ చిన్న గదిలో చిక్కుకుపోయిన తర్వాత తన జీవితాన్ని, కుటుంబాన్ని, తనలోని మనిషిని ఎలా తిరిగి చూసుకున్నాడనేదే సినిమా ప్రధాన కథాంశం.

ఇక బత్తా పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటనను ప్రదర్శించారని చెప్పొచ్చు. గ్యాంగ్‌స్టర్‌గా భయపెట్టే సన్నివేశాల నుంచి కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల వరకు ఆయన నటనలో ఎన్నో షేడ్స్ కనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో చిన్నారి సబరి పాత్ర పోషించిన నటుడు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతితో పోటీపడే స్థాయిలో అతని నటన ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. లిజోమోల్ జోస్, బత్తా భార్యగా, చిన్నారి నటుడు సినిమాకు మరింత ఎమోషనల్ బలం చేకూర్చారు.

మరోవైపు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. పెద్ద యాక్షన్ సీన్లు లేకుండానే ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో వచ్చే మార్పును హాస్యం, ఎమోషన్‌తో దర్శకుడు చెప్పిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం ‘బత్తా’ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తమిళ వెర్షన్‌లో ప్రదర్శితమవుతోంది. తెలుగులో డబ్బింగ్ చేస్తే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 

 

[Baththa Movie, Baththa Movie Review, Vijay Sethupathi Baththa, Vijay Sethupathi Latest Movie, Vijay Sethupathi Best Performance, Baththa Tamil Movie, Balaji Tharaneetharan, Lijomol Jose, Sai Abhyankkar, Tamil Movies, Kollywood News, Vijay Sethupathi Movies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com