బాలయ్య.. ప్రభాస్ ‘పెళ్ళిగోల’
on Dec 6, 2022
నందమూరి బాలకృష్ణ హౌస్ట్‌గా ఆహాలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ వన్ ట్రెమండస్ సక్సెస్ సాధించడంతో సీజన్ 2 ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ షోకి అటు రాజకీయ నాయకులు, ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు, ప్రోడ్యూసర్స్, దర్శకులు వచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. కాగా రెబల్‌స్టార్ ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకి వస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు వచ్చిన ప్రతీ గెస్ట్‌ని కొన్ని కాంటవర్సీ ప్రశ్నలతో పాటు కొన్ని చిలిపి ప్రశ్నలు వేసి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు బాలయ్య. ఇక ఈ షోకి ప్రభాస్ వస్తే మాత్రం ప్రభాస్ కెరీర్ లో కూడా కొన్ని కాంట్రవర్సీలు,రూమర్స్ ఉన్నాయి. అవన్నీ బాలకృష్ణ తెరపైకి తెస్తాడు. ప్రభాస్‌తో సమాధానం చెప్పిస్తాడు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్ళివిషయం మరియు అనుష్కతో వున్న రిలేషన్ షిప్ గురించి క్లారిటీ తీసుకు వస్తాడు బాలకృష్ణ. ఇక ఈ షోకి ప్రభాస్‌తో పాటు హీరో గోపీచంద్ కూడా వస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్, ఆదిపురుష్ ప్రాజెక్ట్ కె’ చిత్రాలలో నటిస్తూ బిజీగా వున్నాడు. వీటితో పాటు మారుతి డైరెక్షన్‌లో వస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
