Home

»

Latest News

‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్: స్పిరిట్ పరిస్థితి ఏంటి.?

Sep 25, 2026 11:32AM

ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడినట్లు ఇటీవల నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది మార్చికి షిఫ్ట్ కానుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే తాజాగా మేకర్స్ డేట్ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 18ను ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌గా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు 2027 మార్చిలో విడుదల కావాల్సిన ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' అక్టోబర్ కి పోస్ట్ పోయినట్లు వినికిడి. ఇంకా 50 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా, నవంబర్ నుంచి రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

 

 

[Fauzi Postponed, Fauzi New Release Date, Prabhas Fauzi Movie, Spirit Postponed, Spirit Release Date, Prabhas Spirit Movie, Hanu Raghavapudi, Sandeep Reddy Vanga, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com