
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలసి ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారా?.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో ఊపేస్తున్న క్రేజీ బజ్ ఇది.
రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' షూటింగ్ ను ఇటీవలే మహేష్ బాబు పూర్తి చేశారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నారు అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పేరు గట్టిగా వినబడుతోంది.

ఇటీవల లోకేష్ కనగరాజ్ ఒక బిగ్ ఐడియాతో మహేష్‌ను కలిసి ఓ లైన్ వినిపించారని, దానికి మహేష్ కూడా సానుకూలంగా స్పందించారని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది. రాజమౌళి సినిమా పూర్తయిన వెంటనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. లోకేష్ ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ సినిమా కమిటై ఉన్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న 'రాకా' ఆలస్యమవుతుండటంతో.. ఈ గ్యాప్ లో మహేష్ ప్రాజెక్టును లోకేష్ పట్టాలెక్కిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: అక్కడే నా ఇగో దెబ్బతింది: శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు కామెంట్స్.!
[Mahesh Babu Lokesh Kanagaraj Movie, Mahesh Babu Next After Varanasi, Mahesh Babu Next Movie, Mahesh Babu Varanasi Movie, Mahesh Babu, Lokesh Kanagaraj, Allu Arjun, Telugu Film News, Telugu News]





